RRR Movie : ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం తెలుగు సహా పలు భారతీయ భాషల్లో సత్తా చాటింది. అంతేకాదు చైనా, జపాన్, యూఎస్ ప్రేక్షకులను కూడా ఎమోషనల్ కంటెంట్, విజువల్ గ్రాండియర్‌తో ఎంతగానో మెప్పించింది. ఈ క్రమంలోనే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’.. ఆస్కార్ దిశగా అడుగులేస్తోంది. ఈ మూవీలోని మాస్ ట్రాక్ ‘నాటు నాటు’ బెస్ట్ సాంగ్ నామినేషన్స్ బరిలో నిలిచిన విషయం విదితమే.
ఆర్ఆర్ఆర్ మూవీ ఒక కేటగిరీలో ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో చేరింది. ఈ సినిమా కోసం ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన పాపులర్ సాంగ్ ‘నాటు నాటు’ బెస్ట్ సాంగ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడింది. ఈ కేటగిరీకి 81 పాటలు అర్హత సాధించగా.. వాటిలో 15 పాటలు షార్ట్‌లిస్ట్‌కు ఎంపిక చేయబడ్డాయి. నామినీలను నిర్ణయించడానికి మ్యూజిక్ బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు. ఇక ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానంలో సత్తా చాటింది. రెండు కేటగిరీల్లో అవార్డ్ కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు.. నాటు..’ నామినేట్ అయ్యింది.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా నాటు నాటు ఎంపిక కావడంతో అతిరథ మహారథుల మధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ మాస్ సాంగ్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఎంతగా ఉర్రూతలూగించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అంటే అది ఆస్కార్‌కు ఎంట్రీ లాంటిది అంటుంటారు..ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ అవార్డ్ దక్కించుకోగా, ఆస్కార్లోను ఈ సినిమా సత్తా చాటుతుందని అంటున్నారు.
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— DVV Entertainment (@DVVMovies) January 11, 2023
Also Read:
horoscope today telugu : 11-1-2023 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు