Homecinemathegimpu telugu movie review : 'తెగింపు' తెలుగు మూవీ రివ్యూ

thegimpu telugu movie review : ‘తెగింపు’ తెలుగు మూవీ రివ్యూ

Telugu Flash News

thegimpu telugu movie review: థియేట‌ర్స్‌లో సంక్రాంతి సంద‌డి ఈ రోజు నుండి మొద‌లు కానుంది. ముందుగా తమిళ స్టార్ సీనియర్ హీరో అజిత్ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తునివు.. తెలుగులో తెగింపు పేరుతో ప్రపంచ వ్యాప్తంగాఉన్న ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి షో ప‌డ‌గా, సినిమా ఎలా ఉంది, ప్రేక్ష‌కులకి న‌చ్చుతుందా లేదా అనేది చూద్దాం.

thegimpu telugu movie rating : 3/5

క‌థ‌:

సినిమా అంత‌టా అజిత్ పేరు తెలియ‌కుండా క‌థ‌ని న‌డిపించారు. కొద్ది సార్లు డార్క్‌డెవిల్ లేదా చీఫ్ అని మ‌రోసారి మైఖేల్ జాక్సన్ అని కూడా పిలుస్తారు. అజిత్, కన్మణి (మంజు వారియర్) మరియు వారి ముఠా, మరో ముగ్గురు సభ్యులు (అమీర్, పావ్ని మరియు సిబి) అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న‌ కాంట్రాక్ట్ దొంగలు. వారు అత్యంత సమర్థవంతమైన వారు. అత్యుత్తమ సాంకేతికత, ఆయుధాలతో పాటు హై-ఫై దొంగకు అవసరమైన ప్రాప‌ర్టీస్ క‌లిగి ఉంటారు.. ఒక రోజు, అజిత్ మరియు అతని గ్యాంగ్ క్రిష్ (జాన్ కొక్కెన్) నేతృత్వంలోని యువర్ బ్యాంక్‌ను దోచుకునే మిషన్‌ను నిర్వహించాల‌ని ప్లాన్ చేస్తారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది, ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొన్నారు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప‌ర్‌ఫార్మెన్స్:

thegimpu telugu movie reviewసినిమాలో అజిత్ వ‌న్ మ్యాన్ షోగా అల‌రించాడు. కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ‌గా ఉంటే బాగుండేది.మిగ‌తా ఆర్టిస్ట్‌లు కూడా బాగా ప‌ర్‌ఫార్మ్ చేశారు. దర్శకుడు వినోద్ అక్కడక్కడా కొన్ని మాస్ మూమెంట్స్ పెట్టారు. కానీ ఇంటర్వెల్ పోర్షన్ వరకు సినిమా అంతగా ఆసక్తిని పెంచదు. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం యాక్షన్ పరంగా మెప్పిస్తుంది. ఇక సినిమా నిలబడాలంటే అద్భుతమైన సెకండ్ హాఫ్ అవసరం. కానీ వినోద్ ఫస్ట్ హాఫ్ కంటే కాస్త బెటర్ అనిపించే సెకండ్ హాఫ్ మాత్రమే డెలివరీ చేశారు. వినోద్ ఈ చిత్రం కోసం అద్భుతమైన పాయింట్ ఎంచుకున్నారు. కథలో బ్యాగ్రౌండ్ సెటప్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ నెరేషన్ ఫ్లాట్ గా ఉండడంతో సినిమా అంతగా పేలలేదు. క్లైమాక్స్ రొటీన్ గా ఉండడం కూడా ఈ చిత్రానికి మైనస్ గా మారింది. స్క్రీన్ ప్లేలో గందరగోళం కనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కథకి తగ్గట్లుగా అద్భుతంగా ఉంటుంది.

ప్ల‌స్ పాయింట్స్:

క‌థ‌
న‌టీన‌టులు
ఇంట‌ర్వెల్ బ్లాక్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

మైన‌స్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే
నెరేష‌న్

-Advertisement-

చివ‌రిగా:

సినిమాలో యాక్షన్, పాటలు అన్నిబాగున్నాయి కానీ సినిమాలో ఉన్న మెసేజ్ అయితే మనం ఆల్రెడీ చూసిన దానిలాగే ఉంటుంది. క్లైమాక్స్ రొటీన్ గా ఉండడం కూడా ఈ చిత్రానికి పెద్ద మైన‌స్ అని చెప్పాలి. సంక్రాంతి సీజన్ కాబట్టి తమిళంలో అజిత్ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయి. తెలుగులో పరిస్థితి ఏంటో చూడాలి.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు

జాతీయ వార్తలు

సినిమా వార్తలు

అంతర్జాతీయ వార్తలు

health news

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News