HomecinemaChiranjeevi: క‌మెడీయ‌న్ డైలాగ్ వాల్తేరు వీర‌య్య కోసం చిరు కాపీ కొట్టారా..!

Chiranjeevi: క‌మెడీయ‌న్ డైలాగ్ వాల్తేరు వీర‌య్య కోసం చిరు కాపీ కొట్టారా..!

Telugu Flash News

Chiranjeevi: సంక్రాంతికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ మాములుగా ఉండ‌దు. ఇటు వీర‌సింహారెడ్డి, అటు వాల్తేరు వీర‌య్య చిత్రాలు నువ్వా నేనా అన్న‌ట్టు బ‌రిలోకి దిగుతున్నాయి. ఏ సినిమా బాగుంటుంది, ఏ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంద‌నే ప్ర‌చారం కూడా న‌డుస్తుంది. మ‌రో వైపు సినిమాకి సంబంధించి ప్ర‌తి విష‌యాన్ని కూడా బూత‌ద్ధంలో పెట్టి చూస్తున్నారు. వాల్తేరు వీరయ్య ట్రైల‌ర్ లో చిరంజీవి… రికార్డుల్లో నా పేరు ఉండ‌టం కాదు…..నా పేరు మీద‌నే రికార్డ్స్ ఉంటాయి అంటూ డైలాగ్ చెప్పారు. అయితే ఇదే డైలాగును క‌మెడియ‌న్ పృధ్వీ….సాయి ధరమ్ తేజ హీరోగా వచ్చిన విన్న‌ర్ సినిమాలో కామెడీగా చెప్పాడు.

రికార్డుల్లో నా పేరు ఉండ‌టం ఏంట్రా…నా పేరు మీద‌నే రికార్డులు ఉంటాయ్…సుజాత సింగం సుజాత అంటూ డైలాగ్ చెప్పాడు. అయితే ఆ సినిమాకు గోపిచంద్ మలినేని డైరక్టర్. ప్రస్తుతం సంక్రాంతికి గోపీచంద్ మలినేని, బాబి సినిమాల మధ్యనే పోటీ నడుస్తున్న నేఫధ్యంలో ఈ డైలాగు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో బాబీ అన్నా ఈ పంచ్ డైలాగ్ ను అక్క‌డ లేపావా అంటూ ట్రోల్ చేయ‌డ‌మే కాకుండా ఆ వీడియోని కట్ చేసి వైరల్ చేస్తున్నారు. అయితే అన్నింటిని మ‌నం కాపీ అని అన‌లేము క‌దా. ఒకిరికి వ‌చ్చిన ఆలోచ‌నే మ‌రొక‌రికి రావచ్చు.

అయితే ప్రతిష్టాత్మక చిత్రాలకు రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల కాంబినేషన్ లో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య సినిమాను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం చాలా ఉత్సాహంగా సాగింది. ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ కనిపించ‌న‌నున్నాడు. చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

also read:

Pakistan Crisis : పాకిస్థాన్ ఆర్ధిక తిప్పలను అధిగమిస్తుందా? లేక శ్రీలంకలా దివాళా దిశగా పయనిస్తుందా?

Chiranjeevi: క‌మెడీయ‌న్ డైలాగ్ వాల్తేరు వీర‌య్య కోసం చిరు కాపీ కొట్టారా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News