Lighter: ఒక్కోసారి మ్యాచ్ మధ్యలో క్రికెటర్స్ విచిత్రంగా ప్రవర్తిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాచ్ మధ్యలో లైటర్ అడిగి అందరిని ఆశ్చర్యపరిచాడు. క్రికెటర్లందూ ఆస్ట్రేలియా క్రికెటర్లు వేరయా అనే చెప్పాలి… ప్రత్యర్థి ఆటగాళ్లను సెడ్జ్ చేయడంలో, బాల్ టాంపరింగ్ చేసి దొరికిపోవడంలో, అంపైర్లనే బెదిరించి నిర్ణయం ఛేంజ్ చేసుకునేలా చేయడంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పుడు ముందు ఉంటరు. అయితే రికీ పాంటింగ్, ఆండ్రూ సైమండ్స్, షేన్ వార్న్ వంటి క్రికెటర్లు రిటైర్ అయిన తర్వాత ఆస్ట్రేలియాలో మునుపటి దూకుడు అంతగా కనిపించడం లేదు…
ప్రస్తుతం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో టెస్టు బుధవారం ప్రారంభమైంది. ఇప్పటికే మూడు టెస్టుల ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టులు గెలిచి కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. మూడో టెస్టులోనూ తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. తొలి రోజు 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా.. రెండు వికెట్లు కోల్పోయి.. 147 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీలు సాధించారు. రెండో మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో దుమ్ములేపిన డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులే చేసి అవుట్ కాగా, లబుషేన్ 151 బంతుల్లో 13 ఫోర్లతో 79 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
లబుషేన్ మ్యాచ్ మధ్యలో ఆసక్తికర పని చేశాడు. తనకు సిగరేట్ లైటర్ కావాలంటూ.. ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నవారికి సైగలతో చెప్పాడు. మ్యాచ్ ఆడుతూ.. లబుషేన్‌కు సిగరేట్ లైటర్‌తో ఏంటి పని అనేది అందరికి అర్ధం కాలేదు. ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న ఇతర ఆటగాళ్లకు సైతం అతను సిగరేట్ లైటర్ ఎందుకు అడుగుతున్నాడో కాసేపు అర్థం కాలేదు. లబుషేన్ మరికొన్ని సిగ్నల్స్‌తో అర్థం చేసుకున్న డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆటగాళ్లు పరుగు పరుగునా.. లైటర్ తీసుకొచ్చి లబుషేన్ చేతికిచ్చారు. అప్పుడు అతను నిప్పు వెలిగించి.. తన హెల్మెట్‌కు ఏమో రిపేర్లు చేసుకున్నాడు. హెల్మెట్ లోపల ఎక్స్ట్రా క్లాత్ ఏమైన లబుషేన్‌ను ఇబ్బంది పెట్టి ఉంటుంది.. దాన్ని నిప్పుతో కాల్చుతూ సరిచేశాడు. మొత్తానికి సిగరేట్ తాగుతున్న సైగలతో లబుషేన్ చేసిన న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.