Homeandhra pradeshRoad Shows Ban In AP : జీవోలు, 30 యాక్ట్ లు ప్రతిపక్షానికేనా.. ప్రభుత్వానికి కాదా ?

Road Shows Ban In AP : జీవోలు, 30 యాక్ట్ లు ప్రతిపక్షానికేనా.. ప్రభుత్వానికి కాదా ?

Telugu Flash News

ఇటీవలే రోడ్డు షోలను, ర్యాలీలను బ్యాన్ చేస్తూ (Road Shows Ban In AP) వై.ఎస్ జగన్ తెచ్చిన జీ.వో 1 ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తప్పుపట్టారు. తప్పులు చేస్తూ ప్రజలు, పత్రికలు నిలదీయాకూడదు,వే లెత్తి చూపకూడదు అంటూ అనడం ఏం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు.

తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యానికి అర్థాన్నే మార్చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు కల్పించాల్సిన కనీస హక్కులను లాగేసుకుంటే చూస్తూ ఎవరూ కూర్చునేది లేదన్నారు.

ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడానికి ఉపయోగించే ఆయుధమైన ఉద్యమాలను ముఖ్యమంత్రి అణగదొక్కేస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిపక్షాలు, ప్రజలు,ప్రజా సంఘాలు నోరెత్తడానికి వీల్లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించొద్దు అనేలా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సమంజసం కాదని అచ్చెన్నాయుడు అన్నారు.

ప్రతిపక్షంలో జగన్‌ ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన సమావేశాలకు,సభలు చంద్రబాబు గారు అనుమతి ఇవ్వకుంటే జగన్‌ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగలిగేవారా అంటూ ప్రశ్నించారు.

జగన్ పాదయాత్రలు, రోడ్‌షోలు చేసినప్పుడు ప్రతి కార్యక్రమానికి తెలుగుదేశం ప్రభుత్వం భద్రత అందించిందనీ.. ఇప్పుడు చంద్రబాబు గారు బయటకి వస్తుంటే కనీస భద్రత కల్పించపోగా వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు.

-Advertisement-

ఇలాంటి బెదిరింపు ఆంక్షలకు తెలుగుదేశం పార్టీ భయపడేది లేదని,తెలుగు దేశం పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందనీ అన్నారు.

అప్పుడు మీడియా నోరు నొక్కేయడానికి జీ.వో నెం 2340 ని తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రజలు, ప్రతి పక్షాల నోరు నొక్కేయడానికి జీ.వో నెం 1 తీసుకువచ్చారు. మీకు ఓటమి అంటే అంత భయమా అంటూ ద్వజమెత్తారు.

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు కల్పించిన భావవ్యక్తీకరణను అణగదొక్కే హక్కు జగన్ కి లేదన్నారు. సభలు, రోడ్డుషోలపై జగన్ ఆంక్షలు విధించడం చూస్తుంటే చంద్రబాబు అంటే భయపడుతున్నారన్నారు.

nimmala ramanaidu comments on Road Shows Ban In AP
nimmala ramanaidu



జీవోలు, 30 యాక్ట్ లు ప్రతిపక్షానికే వర్తిస్తాయా…. అధికార పక్షానికి వర్తించవా….అంటూ మండిపడ్డారు. రోడ్ షోలు చేయకూడదని ఆంక్షలు విధించిన జగన్ నేడు రాజమండ్రిలో మున్సిపల్ స్టేడియం నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు ఎలా రోడ్ షో నిర్వహిస్తున్నారని నిలదీశారు.

ప్రజల గొంతును అణిచివేయడానికి జగన్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరూ లొంగరనీ తమను జైల్లో పడేసినా సరే ప్రజలు సభలకు వచ్చి నీకు సమాధానం చెబుతారని అన్నారు.

చంద్రబాబు గారు బయటకి వస్తుంటే జగన్ కి భయమేస్తుంది అని అన్నారు.

also read:

Thota Chandrasekhar : తోట చంద్రశేఖర్ ఎవరు ? బీఆర్ఎస్‌ కి ఇతని రాక..జనసేనకి శాపంగా మారుతుందా ?

Daily exercise : వ్యాయామం ఆరోగ్యానికి ఆయువుపట్టు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News