HomehealthDaily exercise : వ్యాయామం ఆరోగ్యానికి ఆయువుపట్టు

Daily exercise : వ్యాయామం ఆరోగ్యానికి ఆయువుపట్టు

Telugu Flash News

Daily exercise : శారీరక శ్రమ లేదా ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ వ్యాయామం. రోజుకు అరగంట వ్యాయామం చేస్తే చాలు, దీర్ఘాయువు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వయసు మళ్లిన వారు సైతం అరగంట సేపు వ్యాయామానికి కేటాయిస్తే, వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు.

వ్యాయామం మూడు రకాలు:

1. కండరాలు, కీళ్ళు కదలికలు సులభంగా జరిగేందుకు ఉపకరించే వ్యాయామం.

2. వాయుసహిత వ్యాయామం (సైక్లింగ్, నడవడం, పరుగెత్తడం మొదలైనవి)

3. వాయు రహిత వ్యాయామం (యంత్రాల సహాయంతో చేసే వ్యాయామాలు)

ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ లేదా కాసేపు షటిల్ ఆడటం అలా వీలుకాకపోతే థ్రెడ్ మిల్ మీద ఓ గంట పరిగెట్టడం వంటివి చేస్తూ నాజుకుగా వుండేందుకు అన్ని వయసుల వారూ ప్రయత్నిస్తున్న కాలం ఇది.

ఎలాంటి పరికరాలు లేకుండానే ఇంట్లోనే వ్యాయామం చేయవచ్చంటున్నారు నిపుణులు. ఇంట్లోనే మ్యూజిక్ వింటూ, టీవీ చూస్తూనే రకరకాల ఆ వ్యాయామాలు చేయవచ్చంటున్న ఎక్స్పర్ట్స్ మాటలు చదవండి.

-Advertisement-

వాకింగ్ : వాతావరణం అనుకూలంగా ఉంటే ఇంటి సమీపంలోనే రోడ్డుపై వాకింగ్కు వెళ్లవచ్చు.

స్కిప్పింగ్ : తాడు సాయంతో స్కిప్పింగ్ చేయండి. ఆహ్లాదంతోపాటు సంతోషం మీ సొంతమవుతుంది. పుష్అప్ప్స్  : మీ ఇంటి గోడ వద్ద ఒక స్తంభాన్ని పట్టుకొని పుష్అప్ప్స్ చేయండి చాలు. ఈ వ్యాయామం వల్ల శరీరంలో మజిల్స్ చురుగ్గా మారుతాయి.

జాగింగ్ ఇన్ ప్లస్ : ఇంట్లోనే హాలులో టీవీ చూస్తూ లేదా టెర్రస్ పై మ్యూజిక్ వింటూ జాగింగ్ చేయవచ్చు. కేవలం దీనికి కావాల్సింది మీ కాళ్లకు రక్షణగా మంచి నాణ్యత గల షూ ఒక్కటే.

ఇంకా కూర్చోవటం, నిలబడటం వంటివి చేయడం, ఏదైనా తక్కువ బరువు ఉన్నది పైకెత్తి కిందకు దింపుతుండటం, మీకు ఇష్టమైన పాటకు లయబద్ధంగా నృత్యం చేయడం కూడా గొప్ప వ్యాయామమే.

daily exercise



మీ ఇంట్లోనే మెట్లను ఎక్కిదిగుతుండటం కూడా మంచి ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడంవలన ఎక్కువగా కండరాలను, రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడానికి, అధిక బరువు తగ్గించడానికి, మానసిక ఉల్లాసం కొరకు చేస్తారు.

ఆకలి పెరుగుతుంది. సోమరితనం పోతుంది. శరీరం దారుఢ్యంగా తయారవుతుంది. తేలికగ, శుభ్రంగా ఉంటుంది. అలసట, బడలిక, దప్పిక, వేడి, చల్లదనం ఇలాంటివాటిని తట్టుకునే శక్తి ఏర్పడుతుంది.

క్రమం తప్పకుండా చేసే వ్యాయమం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. కొన్ని రకాల మానసిక వ్యాధులవారికి ఇది తోడ్పడుతుంది. శారీరక అందాన్ని పెంపొందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తుంది.

also read : 

Dubai Alcohol: మందుబాబులకు మరింత కిక్కు.. దుబాయ్ లో లిక్కర్‌పై ట్యాక్స్‌ రద్దు!

Delhi Accident : ఢిల్లీ యువతి హత్య కేసులో సంచలన విషయలు.. కారుతో ఢీకొట్టి.. గంటన్నరపాటు ఈడ్చుకెళ్లి..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News