Homehealthmorning breakfast : ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తున్నారా? కొత్త ఏడాదైనా ప్రారంభించండి.. బెనిఫిట్స్‌ ఇవే!

morning breakfast : ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తున్నారా? కొత్త ఏడాదైనా ప్రారంభించండి.. బెనిఫిట్స్‌ ఇవే!

Telugu Flash News

రోజూ ఉదయం రకరకాల అల్పాహారాలు తీసుకుంటూ ఉంటాం. అయితే, బ్యాచిలర్స్‌ కానీ, హాస్టళ్లలో ఉంటున్న వారుగానీ, రాత్రి పూట విధులు నిర్వర్తించేవారుగానీ చాలా మంది మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ (morning breakfast) ను తప్పిస్తుంటారు.

బిజీ లైఫ్‌ కారణంగా మరికొందరు టిఫిన్‌ చేయడాన్ని స్కిప్‌ చేస్తుంటారు. ఇలా ఉదయం టిఫిన్‌ చేయకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం అల్పాహారం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.

రోజంతా పని చేయాలంటే శరీరానికి తగినంత బలం అవసరం. ఇందుకోసం ఉదయం తీసుకొనే అల్పాహారం చాలా దోహదం చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకపోవడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఉదయం అల్పాహారంలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండటంతోపాటు ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు.

ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మధ్యాహ్నం సమయానికి బాగా ఆకలి వేస్తుంది. ఈ సమయంలో తినాల్సిన దానికన్నా కాస్త ఎక్కువే లాగిస్తారు. తద్వారా అధిక బరువు పెరగడం, కొవ్వు పేరుకుపోవడం, విపరీతమైన పొట్ట రావడం లాంటివి జరుగుతాయి.

దాంతోపాటు ఎసిడిటీ సమస్య కూడా వచ్చేస్తుంది. తాజాగా జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. ఉదయం టిఫిన్‌ చేసే వారి కంటే స్కిప్‌ చేసే వారికి గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉందని తేలింది.

-Advertisement-

గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరి

గుండె సంబంధిత సమస్యలు రాకుండా గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే ఉదయంపూట తప్పనిసరిగా బ్రేక్‌ ఫాస్ట్‌ చేయాల్సిందేనని అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

రాత్రంతా పడుకొని ఉదయం నిద్ర లేవగానే శరీరానికి విటమిన్లు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు అవసరం అవుతాయి. అందుకే క్రమం తప్పకుండా ఉదయం టిఫిన్‌ చేయాలి. మెదడు చురుగ్గా పని చేయాలన్నా మార్నింగ్‌ టిఫిన్‌ చేయడం తప్పనిసరి.

also read :

Pawan Kalyan: ఇది క‌దా ప‌వన్ మేనియా.. రీరిలీజ్‌ని కూడా ఇంత‌గా ఆద‌రిస్తారా…!

Johnny Depp : పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ హీరో ‘జానీ డెప్’ గురించి తెలుసుకోండి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News