చిగుళ్ల నుంచి రక్తం కారడం (Bleeding Gums) లాంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇందుకు కారణాలు రకరకాలుగా ఉంటాయి. అయితే, కొందరు తమ పళ్లు తెల్లగా నిగనిగలాడుతున్నాయని, నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలను పట్టించుకోరు. ఇలా చిగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల నోట్లో అనేక రకాల సమస్యలు ఏర్పడతాయని దంతవైద్యులు హెచ్చరిస్తున్నారు.
నోటి సమస్యలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం కలుగజేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కేవలం నోటి సమస్యే అని నిర్లక్ష్యం చేయరాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా చిగుళ్లు పసుపు రంగులోకి మారినా, బ్రష్ చేసేటప్పుడు రక్తం కారినా అనేక రకాల అనారోగ్య సమస్యలకు సంకేతంగా భావించాలి.
చిగుళ్ల వాపు, రక్తం కారడం లాంటి సమస్యలతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ లోపం కారణంగానూ చిగుళ్ల వాపు, రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు శరీరంలో విటమిన్లు లోపించినా ఇలాంటి సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మల్టీవిటమిన్ సప్లిమెంట్, ఒమేగా-3 ఫిష్ ఆయిల్ తీసుకుంటే ఇలాంటి విటమిన్ లోపాలను అధిగమించవచ్చు.
నోటి నుంచి దుర్వాసన వస్తే లోపం ఉన్నట్లే..
నోట్లో దుర్వాసన వస్తుంటే శరీరంలో ఏదో అనారోగ్యం ఉన్నట్లేనని నిర్ధారణకు రావాలి. నోటి నుంచి దుర్వాసన వస్తుంటే చిగుళ్లు పటిష్టంగా లేవని అర్థం చేసుకోవాలి. అయితే, సైనస్, ముక్కు, గొంతులో వాపు లాంటి సమస్యలు ఉన్న నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది. మరోవైపు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాని సందర్భంలో యాసిడ్స్ రిఫ్లక్స్ వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. దాంతోపాటు నోటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ రెండు సార్లు బ్రష్ చేయాలి. మౌత్ వాష్ తరచూ వాడుతూ ఉండాలి. విటమిన్ల లోపం ఉంటే విటమిన్ సప్లిమెంట్స్ వాడాలి.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు