HomeinternationalChina Vaccine : చైనా వ్యాక్సిన్‌లో పస లేదు.. నియంత్రణలోకి రాని కరోనా.. మాకొద్దంటూ పలు దేశాల రిజెక్ట్‌!

China Vaccine : చైనా వ్యాక్సిన్‌లో పస లేదు.. నియంత్రణలోకి రాని కరోనా.. మాకొద్దంటూ పలు దేశాల రిజెక్ట్‌!

Telugu Flash News

China Vaccine : చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజూ లక్షల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ వ్యాప్తంగా అనేక అధ్యయనాలు, మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. తొలుత కఠిన నిబంధనలను అమలు చేసిన చైనా సర్కార్‌.. ప్రజా ఉద్యమానికి తలొగ్గి లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చింది. అయితే, తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. గత నెల రోజులుగా కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడ్డారని అంచనాలు వెలువడుతున్నాయి.

కరోనా ఆంక్షలు సడలించడం ఒక ఎత్తయితే.. చైనా దేశంలో తయారైన వ్యాక్సిన్‌లో పస లేకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. వేరే దేశాల వ్యాక్సిన్‌ను చైనా తీసుకోకపోవడం, తమ దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్‌కు కరోనా తలొగ్గకపోవడం వెరసి.. లక్షల సంఖ్యలో కరోనా మరణాలు, కోట్ల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రస్తుతం అల్లకల్లోలంగా మారిపోయింది. ఎక్కడ చూసినా శవాల గుట్టలు, ఖననం చేసేందుకు కూడాప్లేస్‌ దొరకడం లేదని ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

చైనాలో ఇప్పటికే దాదాపు వంద కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ క్రమంలో కోట్ల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తున్నాయంటే.. అందుకు కారణం వ్యాక్సిన్‌ పనిచేయకపోవడమేనని అంతర్జాతీయ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక కరోనా వ్యాప్తి మరోసారి పెరగడంతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్‌ అయ్యాయి. వ్యాక్సిన్‌ దేశీయంగా తయారు చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఇండియాలోనూ నాసల్‌ వ్యాక్సిన్ వాడేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

చైనా టీకాకు నిరాదరణ..

పలు దేశాలు చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను గతంలో ఆర్డర్‌ చేశాయి. చైనా ప్రభుత్వరంగ ఫార్మా కంపెనీ తయారు చేసిన సినోఫార్మ్‌, ప్రైవేట్‌ రంగంలో తయారైన కరోనావాక్‌కు మొదట చైనా ఆమోదం తెలిపింది. వీటిని తమ పౌరులకు ఇచ్చి పలు దేశాలకు సరఫరా చేసింది. అయితే, తర్వాత ఈ వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేయకపోవడంతో ఆఫ్రికా దేశాలు, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలు ప్రస్తుతం చైనా వ్యాక్సిన్‌ను నిరాకరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. మెరుగైన వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నాయి.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News