Rewind 2022 : ఈ ఏడాది పొరుగు పరిశ్రమ నుంచి వచ్చి తెలుగు పరిశ్రమలో అందర్నీ ఆశ్చర్య పరిచే పలితాలు అందుకున్న డబ్బింగ్ సినిమాలు చాలానే ఉన్నాయి.అవి ఏ సినిమాలో…ఏ హీరో సినిమాలో ఒక లుక్ వేద్దాం రండి.
కే.జీ.ఎఫ్ చాప్టర్ 2
కే.జీ.ఎఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 14న భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సంచలనంగా మారింది.ప్రతి క్షణం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమా రాబోయే కన్నడ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల మనసులకు చేరువైయే అవకాశం కల్పించింది.ఈ సినిమా తొలి రోజే 100కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది.
విక్రమ్
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా విక్రమ్.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ప్రతి సన్నివేశానికి వెంట్రుకలు నిక్క బొడుచుకునే విధంగా దర్శకుడు లోకేష్ కనగ రాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు.హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించగా,అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 450 కోట్లు కొల్లగొట్టి అందర్నీ అవాకయ్యేలా చేసింది.
విక్రాంత్ రోన
కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ విక్రాంత్ రోన.విభిన్నమైన కథతో,ఆసక్తి రేకెత్తించే సన్ని వేసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా.సంగీత దర్శకుడు అజనీష్ లోకనాత్ స్వరాలు సమకూర్చగా,దర్శకుడు అనూప్ బందారి తెరకెక్కించిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది.
777 చార్లీ
కేజీఎఫ్ 2, విక్రాంత్ రోనా వేసిన బాటలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కన్నడ సినిమా కూడా అదిరిపోయే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.కేవలం 20 కోట్లతో తెరకెక్కిన ఈ యాక్షన్-ఎమోషనల్ డ్రామా దాదాపుగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరి ప్రశంసలను పొందింది.
కాంతారా
పొరుగు రాష్ట్రం నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగు రాష్ట్రాలలో దుమ్ము రేపిన కన్నడ సినిమా కాంతారా. కే.జీ.ఎఫ్ తో భారీ విజయాన్ని అందుకున్న హోంబలే వారు ఈ సినిమాను నిర్మించగా,ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రాణం పెట్టి దర్శకత్వం వహించారు రిషబ్ శెట్టి.కేవలం 16 కోట్ల బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది చివర్లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 450 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.
లవ్ టుడే
5 కోట్ల బడ్జెట్ తో ఒక చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా తమిళ్లో బారి విజయాన్ని అందుకుని,తెలుగు నాట కూడా అదే ఫలితాన్ని దక్కించుకుని దాదాపుగా 70 కోట్ల రూపాయలని కొల్ల గొట్టింది.ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వం వహిస్తూ,ప్రాణం పెట్టి నటించిన ఈ సినిమా తను ఆశించిన ఫలితాన్నే అందించి ఒక సంచలనంగా మారింది.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు