Ginger For Skin : ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే వస్తువు అల్లం. నిత్యం కూరల్లో వాడుతూ ఉంటారు. అల్లంతో టీ చేసుకొని తాగడం, శొంఠి వేసుకొని కాఫీ, టీలు తాగడం చాలా మంది చేస్తుంటారు. అల్లంతో ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా పెంపొందించుకోవచ్చు. అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. సీజనల్ వ్యాధుల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడానికి అల్లం ఉపయోగపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ముఖంపై మొటిమలు తొలగించుకోవడానికి అల్లం ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలను తొలగించడానికి తోడ్పడతాయి. మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలను పోగొట్టుకోవడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది. మొటిమల సమస్యతో బాధపడుతున్న వారు అల్లం పేస్టును ముఖానికి రాసుకోవాలి. అల్లం రసంగా చేసుకొని అందులో రెండు టీస్పూన్ల నీరు కలపాలి. తర్వాత తేనె ఓ టీస్పూన్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరలోనే మొటిమలన్నీ మాయమైపోతాయి.
ముఖంపై ముడతలు పోవాలన్నా ఈ పేస్ట్‌ను అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే ముఖంపై ఏర్పడిన టానింగ్‌ను కూడా ఇది తొలగిస్తుంది. అల్లం పేస్ట్‌ను ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై మృత కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా తయారయ్యేలా చేస్తుంది. దాంతోపాటు చెడు బ్యాక్టీరియాను కూడా నశింపజేసే శక్తి దీనికి ఉంటుంది.
బ్లాక్ హెడ్స్ పోవాలంటే ఇలా చేయండి
అల్లం పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అనంతరం పాలపొడి లేదా గంధం పొడి వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్నిముఖంపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే బ్లాక్ హెడ్స్ తొలగిపోయి చర్మం సహజ మెరుపు వచ్చేలా చేస్తుంది. మరోవైపు రోజ్ వాటర్, తేనెతో అల్లం కలిపి కూడా ముఖానికి రాసుకోవడం వల్ల చర్మంపై బ్యాక్టీరియాలు నశిస్తాయి. చర్మానికి రక్షణ ఇస్తుంది. ఇలా అనేక పద్ధతుల ద్వారా చర్మంపై ముడతలు తగ్గించడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది.
also read news:
18 Pages telugu movie review : ’18 పేజెస్’ తెలుగు మూవీ రివ్యూ
Dhamaka telugu movie review : ధమాకా తెలుగు మూవీ రివ్యూ