Homeviral newsviral video today : నేను నీ సర్వెంట్‌ కాదు.. ఉద్యోగిని.. ఇండిగో విమానంలో ప్రయాణికుడు-ఎయిర్‌ హోస్టెస్‌ మధ్య వాగ్వాదం

viral video today : నేను నీ సర్వెంట్‌ కాదు.. ఉద్యోగిని.. ఇండిగో విమానంలో ప్రయాణికుడు-ఎయిర్‌ హోస్టెస్‌ మధ్య వాగ్వాదం

Telugu Flash News

viral video today : విమాన ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులకు అనేక అవాంతరాలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ప్రయాణాలు సవ్యంగా సాగవు. విమానం ఆలస్యం కావొచ్చు, సాంకేతిక లోపాలు ఏర్పడవచ్చు, స్టాఫ్‌తో ఇబ్బంది కలగొచ్చు.. ఇలా అనేక రకాల సమస్యలు మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు ఓపిక అవసరం. లేదంటే ఆ ప్రయాణం నరకప్రాయంగా మిగిలిపోవడం ఖాయం.

తాజాగా ఓ ప్రయాణికుడి తీరు, అందుకు విమాన సిబ్బంది ఇచ్చిన సమాధానం, వారి మధ్య నడిచిన వాగ్వాదం నెట్టింట వైరల్‌గా మారింది. ఇండిగో విమానంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.  ఇస్తాంబుల్‌నుంచి న్యూఢిల్లీకి ఇండిగో ఫ్లైట్‌ వస్తోంది. అయితే, విమానంలో ఆహారం ఎంపిక చేసుకొనే విషయంలో ప్రయాణికుడికి, ఎయిర్‌ హోస్టెస్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

బోర్డింగ్‌ పాస్‌లో ఏ ఆహారం అయితే మెన్షన్‌ చేసి ఉంటారో అదే అందిస్తుంటారు ఎయిర్‌ హోస్టెస్‌. అయితే, ఇక్కడ ప్రయాణికుడు వేరే ఆహారం తీసుకురమ్మంటాడు. బోర్డింగ్‌ పాస్‌లో ఏది ఉంటుందో అదే అందిస్తామని ఎయిర్‌ హోస్టెస్‌ చెబుతుంది.

ఇందుకు ప్రయాణికుడు ఎయిర్‌ హోస్టెస్‌పై నోరుపారేసుకుంటాడు. దీంతో ఎయిర్‌ హోస్టెస్‌ ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. అనంతరం తోటి ఎయిర్‌ హోస్టెస్‌ అమ్మాయి సదరు ప్రయాణికుడి వద్దకు వచ్చి నిలదీస్తుంది. మీ వల్ల మా ఉద్యోగిని ఏడుస్తోంది.. బోర్డింగ్‌ పాస్‌లో ఏముంటే అదే సర్వ్‌ చేస్తామని చెప్పింది.

స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌

ప్రయాణికుడు స్పందిస్తూ.. నువ్వు నాకు చెప్పేదేంటి? నువ్వు ప్రయాణికుడి సేవకురాలివి.. అంటూ గదమాయిస్తాడు. ఇందుకు ఎయిర్‌ హోస్టెస్‌.. నేను నీ పనిమనిషిని కాదు.. ఉద్యోగిని అంటూ గట్టిగా సమాధానం చెబుతుంది. దీంతో.. ఆ ప్రయాణికుడు మరింత రెట్టించిన స్వరంతో నోరు మూసుకో.. అంటూ గద్దిస్తాడు. దానికి అంతే గట్టిగా నువ్వు కూడా నోరు మూసుకో.. అంటూ ఎయిర్‌ హోస్టెస్‌ అరుస్తుంది. మరో ప్రయాణికుడు ఇదంతా సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తాడు.

అనంతరం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. తర్వాత ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. ప్రయాణికుడు ఎయిర్‌ హోస్టెస్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని తెలిపింది. తమ అంతిమ లక్ష్యం ప్రయాణికుల సౌకర్యమేనని చెప్పింది.

-Advertisement-

also read news: 

Coronavirus In India : కరోనా మళ్ళీ విజృంభిస్తోందా? దేశంలో మళ్ళీ లాక్ డౌన్ పడుతుందా? BF 7 వేరియంట్ పై కొత్త మార్గదర్శకాలు

Samantha : సమంత సినిమాలకు నిజంగానే బ్రేక్ పడిందా? మళ్ళీ సినిమాల్లో ఎప్పుడు ?

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News