Homeandhra pradeshYs Jagan Govt: సంక్షేమ సారధికి జీతాల సెగలు.. ఏమిటీ దుర్గతి? ఎందుకీ పరిస్థితి?

Ys Jagan Govt: సంక్షేమ సారధికి జీతాల సెగలు.. ఏమిటీ దుర్గతి? ఎందుకీ పరిస్థితి?

Telugu Flash News

తన పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతటా తిరిగిన వైఎస్‌ జగన్‌.. ప్రజల కష్టాలను అత్యంత దగ్గర నుంచి చూశారు. ఈ క్రమంలోనే మీ కష్టాలు నేను చూశాను.. మీ బాధలు నేను విన్నాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ సినిమా హీరో కంటే మేటిగా తన ప్రసంగాలు చేశారు. అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు జగన్‌. ఇందులో చాలా వరకు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు. 90 శాతానికి పైగా హామీలు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నెరవేర్చానని అనేక సందర్భాల్లో జగన్‌ స్పష్టం చేశారు.

సంక్షేమం వరకు జగన్‌ను పేరు పెట్టే పరిస్థితి లేదు. ప్రతి నెలా పింఛన్లు ఒకటో తారీఖును అవ్వాతాతలకు ఇవ్వడం కావచ్చు, రైతు భరోసా, కాపు నేస్తం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ అమలు, రైతు భరోసా కేంద్రాలు, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం.. ఇలా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలతో జగన్‌ మేటిగా నిలిచారు. అయితే, అభివృద్ధి విషయానికి వచ్చేసరికి అడుగులు తడబడుతున్నాయి.

కేవలం సంక్షేమంపైనే ఆధారపడి జగన్‌ పరిపాలన సాగిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో రహదారులు, పంచాయతీలకు నిధులు.. ఇలా ఏ అంశం తీసుకున్నా అభివృద్ధిని దాదాపు పక్కనపెట్టేశారు జగన్‌. పారిశ్రామిక రాయితీలు మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో జగన్‌ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులపై శీతకన్ను వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

ఈ పరిస్థితికి కారణాలేంటి?

ప్రభుత్వ ఉద్యోగి అంటేనే ప్రతి నెలా ఠంచనుగా 1వ తేదీ జీతం పడుతుందని చాలా మంది ఆ దిశగా వెళ్తుంటారు. డబ్బు అవసరం పడతే పీఎఫ్‌ నుంచి అడ్వాన్సు సహా జీపీఎఫ్‌, రుణాలు వంటి వాటికి ఢోకా ఉండదనే అభిప్రాయం ఉంటుంది. దర్జాగా పదిమందికి ఆదర్శంగా నిలుస్తామనే ధీమాతో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అయితే, ఈ పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్‌ 13వ తేదీ గడిచిపోయినా నవంబర్‌ నెల జీతాలు ఇంకా అందలేదు. దీనికి కారణాలు రకరకాలుగా ఉన్నాయి. సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో డబ్బు వెచ్చిస్తుండడం ప్రధాన కారణం కాగా, ఉద్యోగులపై ప్రభుత్వ చిన్న చూపు కూడా ఒక కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ప్రతినెలా ఇంటి ఖర్చులు, ఈఎంఐలు, ఇలా అనేక రకాల వాటికి ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందోనని చర్చించుకుంటున్నారు.

also read news: 

పేర్లు పరాయివి కంపెనీలు మనవి.. ఈ పేర్లు వింటే ఆశ్చర్యపోతారు!

-Advertisement-

Shriya Saran Latest hot Photoshoot Instagram pics 2022

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News