sleeping tips : హాయైన పాట వింటూ నిద్రలోకి జారిపోవడం ఎంతో బాగుంటుంది. డైలీ లైఫ్ లో ఉరుకులు పరుగులకు పుల్ స్టాప్ నిద్రే ! మానసిక విశ్రాంతినిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. రాత్రివేళ గాఢ నిద్ర పోవాలంటే ఈ కొన్ని చిట్కాలు ప్రయత్నించండి..
- నిద్రకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని అమలుపరచాలి. అతిగా నిద్రపోకూడదు. అలాగని అసలు నిద్రపోకుండా ఉండకూడదు. నిద్రలోనే సగం అనారోగ్యాలు తగ్గుతాయి.
- చాలామంది నిద్రపట్టక అటూ ఇటూ దొర్లి ఎప్పటికో నిద్రపోతారు. ఆహారపు లోపం, మానసిక అప్రశాంతతే దానికి కారణం.
- మీ పడకగదిలో నీలం, పసుపు, ఆకుపచ్చ రంగులలో ఏదో ఒకరంగును మాత్రమే బెడ్ బల్బ్ గా వాడండి. నిద్రరావాలంటే హాయైన వాతావరణం ముఖ్యం. ఎక్కువ వెలుగు ఉండకూడదు.
- నిద్రపోయేముందు టీ, కాఫీలు త్రాగకండి. గదిలోకి గాలి వచ్చేలాగా ఒక కిటికీ తెరిచి ఉంచండి. ఫ్యాను స్పీడు తగ్గించండి.
- అనవసరమైన విషయాలను గురించి ఆలోచిస్తే మనసు భారమై నిద్రపట్టదు. నిద్ర ఒక వరం అని ప్రతి నిముషం గుర్తు పెట్టుకోండి.
- దిండు మెత్తదిగా ఉంటే సుఖనిద్ర. ఆహారం భారీగా తీసుకుంటే నిద్రకు దూరమగునట్టే !
- బెడ్ ఎక్కేముందే టాయిలెట్ కి వెళ్ళే అలవాటు అలవరచుకోవాలి లేదంటే నిద్రా భంగమే !
- నిద్రపోయేముందు ఆహ్లాదకరమైన విషయాలు గుర్తు తెచ్చుకోండి !
- నిద్ర ఇంకా రాకపోతే పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొండి.. అదే జోలపాట పాడుతుంది.
మరిన్ని ఆరోగ్యకరమైన వార్తలు చదవండి :
fruits with benefits : ఏ పండు ఏమిస్తుందో చూద్దామా?
Weight loss :మీరు నాజూగ్గా కనబడాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు..
Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..
-Advertisement-