Telugu Flash News

Viral Video: అన్నం పెట్ట‌కుండా అమ్మ కొడుతుందంటూ పోలీస్ కంప్లైంట్ చేసిన 8 ఏళ్ల బుడ‌త‌డు..!

Viral Video:ఈ రోజుల్లో మ‌నుషులు చాలా క‌ర్క‌శంగా మారుతున్నారు. బ‌య‌ట వాళ్ల‌పైనే కాదు సొంత వాళ్ల‌పై కూడా క‌నిక‌రం చూపించ‌లేక‌పోతున్నారు. చిన్న చిన్న పిల్ల‌ల‌పై త‌ల్లిదండ్రులు చాలా దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్న సంఘ‌ట‌న‌లు చూస్తుంటే ఈ స‌మాజం ఎటు పోతుంద‌నే సందేహాలు త‌లెత్తుతున్నాయి.

తాజాగా ఓ 8 ఏళ్ల వ‌య‌స్సున్న కుర్రాడు త‌న త‌ల్లి అన్నం పెట్ట‌కుండా కొడుతుందంటూ పోలీస్ కంప్లైంట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇది చూసి చాలా మంది క‌న్నీరు కారుస్తున్నారు.

వివ‌రాల‌లోకి వెళితే బీహార్ లోని సీతామఢీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన చిన్నారి మా అమ్మ అన్నం పెట్టకుండా కొడుతుంద‌ని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ విష‌యం విన్న పోలీసులు అత‌నికి భోజ‌నం పెట్టి అనంతరం ఓ కుర్చీ వేసి అందులో కూర్చోమ‌న్నారు.

ఆ తర్వాత వివ‌రాలు అడిగి తెలుసుకోగా, స్టోరీ మొత్తం చెప్పాడు. అత‌డి పేరు శివ‌మ్ అని , వ‌య‌స్సు 8 సంవ‌త్స‌రాలు అని అన్నాడు.సీతామఢీలోని చంద్రిక మార్కెట్ సమీపంలో వీరి కుటుంబం నివస్తోండ‌గా, . తండ్రి పేరు సందీప్ గుప్తా అని చెప్పుకొచ్చాడు.

తండ్రి వీరితో క‌లిసి ఉండ‌డ‌ని చెప్పిన బాలుడు తాను త‌న త‌ల్లిని అన్నం అడిగితే కొడుతుంద‌ని పోలీసుల‌కి చెప్పాడు. ఈ విష‌యం విన్న త‌ర్వాత పోలీసులు ఇంటికి వెళ్లి… ఏంటమ్మా.. అన్నం పెట్టడం లేదా? అని ప్ర‌శ్నించ‌గా, అదేం లేదు సార్… ఒక్కోసారి అల్లరి చేస్తే తిడుతుంటానని, బాగా మారాం చేసినప్పుడు గట్టిగా గద్దిస్తానని తప్పా అంత‌గా కొట్ట‌ను అని చెప్పింది.

అయితే పోలీసులు జాగ్ర‌త్త‌లు చెప్పి వెళ్లిపోయారు. అయితే బాలుడి వీడియో మాత్రం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కొంద‌రు నెటిజ‌న్స్ త‌ల్లిని తిడుతుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం బాలుడి ధైర్యంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Exit mobile version