Telugu Flash News

8 Ganesh Temples in Maharashtra : అష్టగణపతి క్షేత్రములు

8 Ganesh Temples in Maharashtra

మయూరేశ్వరుడు :

గణపతి “సింధు” అనే రాక్షసుడిని వధించి యిక్కడ విశ్రమించినట్లుగా చెబుతారు. మయూరేశ్వరుడిగా పూజలు అందుకుంటారు. “పూనా”కు 40 కి.మీ.ల దూరంలో “యోరగావ్” అనే గ్రామంలో ఈ ఆలయం వున్నది.

చింతామణి గణపతి :

కపిలమునికి “గుణుడు” అనే దురాశా పరుడి నుండి “చింతామణి”ని సాధించియిచ్చారు. పూనా-డోండో రైల్వేలైన్లో “లోని” అనే స్టేషన్ దగ్గర్లో “తెయ్యార్” అనే గ్రామంలో ఈ క్షేత్రం నెలవై వున్నది. ఈ క్షేత్రం ప్రక్కనే ముళీ ముఠా అనే నది వున్నది. పూణేలో “సార్వగేట్” దగ్గర బస్సులు ఈ క్షేత్రమునకు వెళ్ళేవి వుంటాయి.”

సిద్ధి వినాయకుడు :

సిద్ధిటేక గ్రామంలో వున్నది. పూణేలో శివాజీ నగర్ బస్ స్టాప్ దగ్గర నుండి ఈ క్షేత్రానికి బస్ సౌకర్యం వున్నది. డోండీ-షోలాపూర్ స్టేషన్ల మధ్య బోరీబల్ స్టేషన్కు ఆరు కి.మీ.ల దూరంలో ఈ క్షేత్రంవున్నది. మధుకైటభుల సంహారానికి వెళ్ళేముందు శ్రీ మహావిష్ణువు ఈ గణపతిని ఆరాధించారని స్థలపురాణం చెబుచున్నది.

మహాగణపతి :

త్రిపురాసుర సంహారానికి వెడుతూ శివుడు అర్చించిన గణపతి ఈ మహాగణపతి. పూనా అహమ్మదాబాద్ నగరముల మధ్యలో ప్రధాన రహదారి పక్కన “రంజన్గావ్” గ్రామంలో ఈ క్షేత్రం వున్నది.

విఘ్నహరుడు :

ఇంద్రుడు సృష్టించిన విఘ్నాసురులను సంహరించ డానికి ఈ విఘ్నహరుడు అవతరించాడు. “జామ్నేర్”కు 6 మైళ్ళ దూరంలో వున్న “ఒఝార్” గ్రామంలో ఈ క్షేత్రం వున్నది. పూణే-నాసిక్ రోడ్ మీదగా “నారాయణగావ్” కు 7 కి.మీ.ల దూరంలో వున్నది.

గిరిజాత్మకుడు :

“గణపతి”ని పుత్రుడుగా పొందుటకు పార్వతీ దేవి తపస్సుచేసిన స్థలం”లేణ్యాద్రి”. “జున్నారు”కు 3 కి.మీ.ల దూరంలో లేణ్యాద్రి గ్రామంలో ఈ ఆలయం వున్నది. పుణే నుండి జున్నారు 77 కి.మీ.లు. బస్ సర్వీస్ పూణే నుండి వున్నది.

బల్లాలేశ్వరుడు :

బొంబాయి-గోవా మార్గంలో వున్నది. రాయఘడ్ జిల్లాలోని పాలిగ్రామంలో ఈ క్షేత్రం వున్నది. ప్రతి సూర్యకిరణాలు మూలవిరాట్టు మీద పడతాయి.

వరద వినాయకుడు :

సంపదలను విజయాలను అందించే ఈ వరద వినాయకుడు భోపాల్ సమీపంలో మహడ్ గ్రామంలో వున్నారు. పూనా నుండి బొంబాయి వెళ్ళేదారిలో “రహమ్ రన్త్య”కి మూడు కి.మీ.ల దూరంలో ఈ క్షేత్రం వున్నది.”

ఈ పై ఎనిమిది క్షేత్రములు పూణేనుండి ప్రయాణించ వలెను. వీటికి “అష్టగణపతి” క్షేత్రములు అని విశేషంగా పిలువ బడు క్షేత్రములు.

Exit mobile version