pudina benefits : పుదీనా వాసనతో పాటు రుచికరంగా ఉంటుంది. కూరలలో పుదీనని కొందరు తప్పనిసరిగా వాడుతుంటారు. ముఖ్యంగా నాన్‌వెజ్‌లో దీనిని వాడుతుండడం మనం గమనించొచ్చు. పుదీనా చర్మానికి చాలా మేలు చేయడమే కాక కాంతి వంతంగా ఉంచుతుంది.
పుదీనాలో మెంథాల్, ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్, విటమిన్-ఎ, రైబోఫ్లావిన్, కాపర్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండడం వలన ఇది కడుపుకు సంబంధించిన వ్యాధులని తొలగిస్తుంది. ఎక్కువ ఔషదాలలో పుదీనని ఉపయోగించడం మనం గమనిస్తుంటాం.
చాలా ఉపయోగాలు..
- ఇక పుదీనా ఆకులను తీసుకుంటే వాంతులు ఆగిపోయి కడుపులోని గ్యాస్ తొలగిపోతుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల ఇంట్లో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్‌ను తొలగించవచ్చు.
- పుదీనా వల్ల చర్మం శక్తిని పొందుతుంది. అనేక సౌందర్య ఉత్పత్తులలో పుదీనాని ఉపయోగిస్తారు. చర్మం నుంచి మురికిని తొలగిస్తుంది. మీకు జీర్ణక్రియలో సమస్యలు ఉంటే పుదీనా మీకు గొప్ప సహాయం చేస్తుంది.
- వేసవిలో ఇంటి మూలల్లో చీమలు ఎక్కువగా ఉండడం వలన పుదీనా స్ప్రే చేస్తే అన్ని పారిపోతాయి. బాత్రూమ్‌లోని మురికిని తొలగించడానికి కూడా పుదీనాని ఉపయోగిస్తారు. వంటగదిలో పేరుకుపోయిన మురికిని, ఇక్కడ ఉన్న సింక్‌ను శుభ్రపరచడానికి కూడా పుదీనా ఉపయోగపడుతుంది.
- మారుతున్న ఉష్ణోగ్రతలో జలుబు సమస్యను ఎదుర్కొంటే ఖచ్చితంగా పుదీనా ఆకులను వాడడం మంచిది. మీకు గొంతు నొప్పిగా ఉంటే పుదీనా డికాషన్ తాగడం, పుదీనా ఆకులను వాసన చూస్తే మంచి ఉపశమనం ఉంటుంది.
- పుదీనాలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా అదనపు కేలరీలు శరీరానికి ఎక్కువగా అందుతాయి. పొట్ట కొవ్వు పెరిగినప్పుడు పుదీనాను తినమని డాక్టర్లు సలహా ఇస్తుండడం మనం చూస్తుంటాం.
- పుదీనా మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనా ఆకులలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉంటాయి. కాబట్టి వాటిని తప్పనిసరిగా అందరు తీసుకోవడం మంచిది.