T20 World Record: టీ 20 మ్యాచ్‌లలో బ్యాట్స్‌మెన్స్ వీర విహారం చేస్తుండడంతో బౌలర్స్ కుదేలైపోతున్నారు. ఇక స్కోరు బోర్డ్ అయితే పరుగులు పెడుతుంది. తాజాగా దక్షిణాఫ్రికా దేశవాళి టోర్నీ అయిన సీఎస్ఏ టీ20 ఛాలెంజ్ టోర్నీ ప్రపంచ రికార్డుకు వేదికైంది. టైటాన్స్ , నైట్స్ మధ్య జరిగిన పోరులో బ్యాటర్లు విజృంభించి పరుగుల వరద పారేలా చేశారు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కలిపి మొత్తం 40 ఓవర్లలో ఏకంగా 501 పరుగులు నమోదయ్యాయంటే బ్యాట్స్‌మెన్స్ ఎంతగా విజృంభించారో అర్ధం చేసుకోవచ్చు. ఒక టీ20 మ్యాచ్ లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. గతంలో న్యూజిలాండ్ వేదికగా జరిగిన సూపర్ స్మాష్ 2016-17 టి20 టోర్నీలో 497 పరుగులు మాత్రేమ నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డును టైటాన్స్, నైట్స్ మ్యాచ్ బద్దలు కొట్టింది.
బ్యాటింగ్ విధ్వంసం..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 271 పరుగులు చేసి ప్రత్యర్ధుల ముందుకు భారీ లక్ష్యం ఉంచింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్ డివాల్డ్ బ్రెవీస్ విధ్వంసం సృష్టించగా, ఆయన కేవలం 57 బంతుల్లోనే 13 సిక్సర్లు, 13 ఫోర్లతో 162 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నైట్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 230 పరుగులు మాత్రమే చేసింది. దాంతో టైటాన్స్ 41 పరుగుల తేడాతో నెగ్గింది.
ఇక మ్యాచ్ లో బేబీ ఏబీ డీవిలియర్స్ డివాల్డ్ బ్రెవీస్ పలు రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 162 పరుగులు చేయడం ద్వారా అతను టి20 ఫార్మాట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో బ్యాటర్ గా నిలిచాడు. తొలి స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉండగా, 2013 ఐపీఎల్ లో పుణే వారియర్స్ పై 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక 2018లో జరిగిన అంతర్జాతీయ టి20 మ్యాచ్ లో అరోన్ ఫించ్ జింబాబ్వేపై 172 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే టి20ల్లో అత్యంత వేగవంతమైన 150 పరుగులను చేసిన ప్లేయర్ గా బ్రెవీస్ సరికొత్త రికార్డు సాధించాడు. అతడు కేవలం 52 బంతుల్లోనే ఈ మార్కును అందుకోగా, గేల్ ఈ మార్కును అందుకునేందుకు 53 బంతులు ఆడారు.
read more news:
Happy Birthday Shah Rukh Khan : షారూఖ్ ఖాన్ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!