HomesportsIND vs AUS : భారీ ల‌క్ష్యాన్ని కాపాడుకోలేక‌పోయిన టీమిండియా.. ఓట‌మికి కార‌ణాలు ఇవే..!

IND vs AUS : భారీ ల‌క్ష్యాన్ని కాపాడుకోలేక‌పోయిన టీమిండియా.. ఓట‌మికి కార‌ణాలు ఇవే..!

Telugu Flash News

IND vs AUS : ఆసియా క‌ప్‌లో దారుణంగా విఫ‌ల‌మైన భార‌త జ‌ట్టు నిన్న జ‌రిగిన ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోను ఓట‌మిని చ‌వి చూసింది. భారీ ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచిన ఆ ల‌క్ష్యాన్ని కాపాడుకోలేక‌పోయింది. దీంతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టి20లో టీమిండియా పై నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజ‌య‌దుందుభి మోగించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేయ‌గఆ, హార్దిక్ పాండ్యా (71 నాటౌట్), కేఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ (46) అద్భుతంగా రాణించ‌డంతో భార‌త్ అంత పెద్ద స్కోరు చేయ‌గ‌లిగింది. అయితే ఈ స్కోర్ చూసి భార‌త్ గెలుపు ఖాయం అని అంతా అనుకున్నారు.

అస‌లు కార‌ణాలు ఇవే..!

కాని ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసి తొలి విజ‌య్ం సాధించింది. గెల‌పులో గ్రీన్ (61), మ్యాథ్యూ వేడ్ (45 నాటౌట్), స్టీవ్ స్మిత్ (35) కీల‌క పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయని చెప్ప‌వ‌చ్చు .

ఛేదనలో ఆస్ట్రేలియా 16 ఓవర్లు ముగిసే సరికి విజయానికి చాలా దూరంలో ఉంది. అంటే చివరి నాలుగు ఓవర్లలో 55 పరుగులు చేయాలి. క్రీజులో వేడ్, టిమ్ డేవిడ్ వంటి నామ‌మాత్ర‌పు బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. డెత్ బౌలింగ్ స‌మ‌స్య వ‌ల‌న మ‌రో సారి భార‌త్ ఓడింది.

17వ ఓవర్ వేసిన భువనేశ్వర్ 15 పరుగులు సమర్పించుకోగా, 18వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ 22 పరుగులు ఇచ్చాడు. మళ్లీ 19వ ఓవర్ వేసిన భువీ 16 పరుగులు ఇచ్చాడు.

ఇలా కేవలం 20 బంతుల్లోనే భారత్ 57 పరుగులు సమర్పించుకుని ఆస్ట్రేలియాకి విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టింది.

-Advertisement-

ఇక చెత్త ఫీల్డింగ్‌, రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ, టీం సెల‌క్ష‌న్స్ వంటివి కూడా ఓట‌మిలో కీల‌కం అయ్యాయి. ఉమేశ్ యాదవ్ టి20 ప్రపంచకప్ జట్టులో లేకపోయిన అతడికి తుది జట్టులో చోటు ఇవ్వడం అర్థం కాలేదు.

స్టాండ్ బై గా ఉన్న దీపక్ చహర్ కు చాన్స్ ఇస్తే బాగుండేది ఇక టాస్ విషయంలో రోహిత్ శర్మ అన్ లక్కీ గా ఉన్నాడు. టి20 ఫార్మాట్ లో రోహిత్ కు టాస్ ఓడిపోవడం వరుసగా ఇది 5వ‌సారి.

మొహాలీ పిచ్ బ్యాటింగ్ వికెట్ కావడం.. అదే సమయంలో డ్యూ ఫ్యాక్టర్ ఉండటంతో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అదే నిరూపితం అయింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News