Telugu Flash News

financial planning : మీ ఆర్ధిక భద్రత కోసం ఈ 5 సూత్రాలు పాటించండి..

వ్యక్తిగత ఆర్ధిక భద్రత కోసం ఆర్థిక ప్రణాళికను (financial planning) రూపొందించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. రాబోయే 5 నుండి 10 సంవత్సరాలలో చేయాల్సిన ప్రణాళిక. మెరుగైన ఆర్థిక ప్రణాళిక కోసం సామర్థ్యం ఆధారంగా ఆదాయం, ఖర్చులు మరియు లక్ష్యాలను ఏర్పరుచుకోవాలి. నియమాలను ఏర్పరుచుకున్నాక వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా పొదుపును చేయాలి సరైన ఆర్థిక ప్రణాళిక ఇక్కడే సహాయపడుతుంది.

మెరుగైన ఆర్థిక ప్రణాళిక నిర్ణయాల కోసం 5 సూత్రాలు

1. ఆదాయం – పొదుపు = ఖర్చులు

మీరు సంపాదించడం ప్రారంభించిన రోజు నుండి, మీ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయాలి. ఇప్పుడు, మీ ఖర్చులను మిగిలిన మొత్తం నుండి ప్లాన్ చేయండి. మీరు ఎంత తక్కువ పొదుపు చేసినా,పర్లేదు కానీ పొదుపు చేయడం మంచి అలవాటు అని గుర్తించండి.

మెరుగైన ఆర్థిక ప్రణాళిక కోసం ఆదాయం మైనస్ పొదుపు

మీరు ఇప్పటికే కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటే వాటిని సాధించడానికి ఎంత డబ్బు అవసరమో తెలుసుకోండి మరియు దాని కోసం క్రమం తప్పకుండా పొదుపు చేయండి. చాలామంది ముందుగా ఖర్చు చేసి, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మిగిలింది ఆదా చేస్తారు. ఇకనుండి అలాంటి అలవాటు మానుకోండి.

2. ఎంత పొదుపు చేయాలి

మీరు నెలకు సంపాదించే జీతం లేదా వ్యాపార ఆదాయంతో సంబంధం లేకుండా, పొదుపు కోసం కొంత భాగాన్ని కేటాయించండి. మీరు 5 లేదా 10 శాతంతో ప్రారంభించవచ్చు కాలక్రమేణా దాన్ని 25 లేదా 30 శాతం ఆదాయం కంటే ఎక్కువ శాతానికి పెంచవచ్చు. వయస్సుతో పాటు మీ పొదుపులు పెరగాలి. మధ్య వయస్సులో మీరు ఎక్కువ శాతాన్ని ఆదా చేయాలి, సంపాదన లోని ఎక్కువ మొత్తాన్ని ఆదా చేయడానికి ప్రయత్నించవచ్చు. గుర్తుంచుకోండి, ఇక్కడ పొదుపు డబ్బును అధిక దిగుబడినిచ్చే ఆర్థిక ఉత్పత్తుల్లో ఉంచాలి అంటే బ్యాంకు ఖాతా వంటివి.

3. అత్యవసర నిధి

మీరు ఏదైనా ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించే ముందు కూడా, మీ వద్ద తగినంత అత్యవసర నిధులు ఉండాలి అని గుర్తుపెట్టుకోండి.

మెరుగైన ఆర్థిక ప్రణాళిక కోసం, మీ దగ్గర కనీసం ఆరు నెలల ఖర్చుకు సరిపడా డబ్బు ఉండేలా చూసుకోండి. ఉద్యోగం పోవడం లేదా మెడికల్ ఎమర్జెన్సీ వంటి అత్యవసర పరిస్థితులలో ఇది ఉపయోగపడుతుంది.

4. లైఫ్ కవర్

మెరుగైన ఆర్థిక ప్రణాళిక కోసం వార్షిక ఆదాయానికి 12-15 రెట్లు పొదుపు చేయగలగాలి. కుటుంబంలో సంపాదించే వారు లేనప్పుడు వారి జీవనాన్ని కొనసాగించడానికి ఇది తోడ్పడుతుంది. గృహ రుణాలు మొదలైనవి వీటిలో చేర్చకూడదు.

5. పదవీ విరమణ కోసం ఎంత పొదుపు చేయాలి

ఇంతే పొదుపు చేయాలి అని లేదు కానీ ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితం కోసం వార్షిక ఆదాయానికి 25-30 రెట్లు పొదుపు చేయగలగాలి. అయితే అందరికి ఒకేలా ఉండకపోవచ్చు కానీ ఒక ప్రణాళిక ఉండటం అందుకోసం పొదుపు చేయడం చివరికి తగినంత డబ్బుతో పదవీ విరమణ చేయడం వల్ల జీవితపు చివరి అంకంలో ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా మరొకరిపై ఆర్ధికంగా ఆధారపడకుండా బ్రతికే అవకాశాన్ని ఇస్తుంది.

also read : 

Viral Video: క్యాన్స‌ర్ నుండి కోలుకుని స్కూల్‌కి.. ఘ‌న స్వాగ‌తం ప‌లికిన తోటి విద్యార్ధులు..

నో వర్క్ ఫ్రమ్ హోం, గాలి నాణ్యత మెరుగుపడడం తో తిరిగి తెరుచుకోనున్న ఢిల్లీ ప్రాథమిక పాఠశాలలు..సవరించబడిన పరిమితులు,ఆంక్షలు

 

Exit mobile version