Telugu Flash News

easy breakfast recipes : 20 నిమిషాల్లో అయిపోయే 5 రకాల అల్పాహారాలు మీకోసమే..

ఉదయాన్నే సమయం లేదని చాలామంది చేసేపని అల్పాహారం మానేయడం లేదంటే ప్యాకెట్ ఫుడ్ అంటే బ్రెడ్, సెరెల్ లేదా కార్న్ ఫ్లేక్స్ అంటూ వివిధ రకాలైన ఆహారాలు తీసుకుని పొట్ట సరిగ్గా నిండక మళ్ళీ చిరుతిండి రూపంలో ఎదో ఒకటి తినడం. ఇలా చేయడం వల్ల ఆరోజు సమయానికి ఏది తినకపోవడం అరుగుదల సమస్య చివరికి రోజంతా అస్తవ్యస్తం. చూశారా? ఉదయం కడుపు నిండుగా అల్పాహారం తీసుకోవడం మనకు ఎంత ముఖ్యమో.

ఉదయాన్నే లేచేసరికి ఎన్నో పనులు పైగా అల్పాహారం అంటే ముందు రోజు నుండి ప్లాన్ చేసుకోవాల్సిన అల్పాహారాలు కూడా ఉంటాయి అని బాధపడుతున్నారా? మీరు చింతించద్దు క్షణాల్లో అయిపోయే అల్పాహారాల లిస్ట్ మేము క్రిందనే ఇస్తున్నాం , అవి మీరు ఏ సమయంలోనైనా తయారు చేయవచ్చు అంతేకాదు చక్కగా కడుపునిండుపుతాయి మీకు రోజంతా పనిచేసే శక్తిని ఇస్తాయి.

కేవలం 20 నిమిషాల్లో త్వరగా, పోషకాలతో కూడిన అల్పాహారాలు ఇవే.

1. ఉగ్గాణి

అన్నంతో చేసే ఉప్మా గురించి ఎప్పుడైనా విన్నారా? ఉగ్గాని కర్నాటకలో సాధారణంగా చేసే ఒక రకమైన ఉప్మా. మీరు పోహా చేసే అటుకులును తీసుకుని కడగాలి తర్వాత అదనపు నీటిని తీసేయాలి. తరువాత, ఉల్లిపాయ-టమోటో తో వేరుశెనగ మరియు పప్పు అన్ని వేసి సిద్ధం చేయండి. ఆపైన కొంచెం నిమ్మరసం పిండి, వడ్డించండి.

2. ఆలూ పోహా

త్వరగా మరియు సులభంగ అయిపోయే పోహా వంటకం, మీరు ఆవాలు, కరివేపాకు మరియు ఇతర సాధారణ మసాలా దినుసులతో పాటు ఉల్లిపాయలు మరియు బంగాళాదుంపలను తరిగి, వేయించచి పోహాను కలపాలి. అంతే ఘుమఘుమలాడే, కడుపు నిండిన సంతృప్తిని ఇచ్చే ఆలు పోహా సిద్ధం అవుతుంది.

3. చిల్లీ గార్లిక్ పుదీనా పరాటా

మీకు ఎక్కువగా చేసుకునే ఆలూ లేదా గోబీ పరాటాతో విసుగు అనిపిస్తే మిరపకాయలతో కూడిన ఈ వెల్లుల్లి పరాటా మీ విభిన్నమైన రుచిని అందిస్తుంది. ఇందులో ఉండే పుదీనా ఖచ్చితంగా ఈ అల్పాహార రుచిని పెంచుతుంది.

4. మసాలా ఎగ్ భుర్జీ

రుచికి రుచి ఇంకా ప్రోటీన్ రూపంలో ఆరోగ్యం కూడా కావాలంటే చేసుకోవాల్సింది ఈ మసాలా ఎగ్ భుర్జీ. మాములుగా పరాఠా కు పిండిని కలుపుకున్నాక ,మీరు గుడ్లను కొట్టి కొన్ని మసాలాలు వేసి వేయించి భుర్జీ చేసాకా, పరాటాలు చేసుకుని వాటిలో ఈ భుర్జీ పెట్టుకోవచ్చు. చక్కగా మధ్యాహ్నం వరకు కడుపు నిండుగా ఉంచుతుంది.

5. బేసన్ చీలా

చీలా ఖచ్చితంగా ఉత్తర భారతదేశంలో అత్యంత సాధారణంగా చేసే అల్పాహారం. అన్నింటికంటే, ఇది చాలా సులభం మరియు త్వరగా చేయచ్చు, మీరు చేయాల్సిందల్లా నీరు, ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయలు మరియు టొమాటోతో కలపడం ద్వారా బేసన్ పిండిని తయారు చేయండి, దానిని పాన్ మీద పోసి సమాంతరంగా ఉండేలా చూడాలి. బాగా కాలాక మరోవైపు తిప్పి కాల్చాలి అంతే కరకరలాడే బేసన్ చీలా బ్రేక్ఫాస్ట్ తయారు అయిపోయినట్టే.

మీకు సమయం తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి బ్రేక్ ఫాస్ట్ చేసుకుని వేడివేడిగా తినేయండి. వీటికి ప్రత్యేకంగా ప్లానింగ్ అవసరం లేదు ఇంట్లో ఉన్న వస్తువులతో సులభంగా చేసేయండి.

read more news :

Viral Video: కామెంటేట‌ర్స్ కూడా సాహ‌సాలు చేస్తారా.. ప‌డితే ఎంత ప్ర‌మాదం…!

సినిమా ఛాన్స్ కోసం ఆ హీరోయిన్ భ‌ర్త‌కి తెలియ‌కుండా క‌డుపులో బిడ్డ‌ని చంపుకుందా..!

Exit mobile version