Telugu Flash News

kidnap : నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు.. కిడ్నాప్ ను చేధించిన పోలీసులు.. చిన్నారి సురక్షితం

girl kidnap in hyderabad

మేడ్చల్‌లో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ (kidnap) కేసును కొద్ది గంటల వ్యవధిలోనే పోలీసులు విజయవంతంగా ఛేదించారు. మేడ్చల్‌ ఈడబ్ల్యూఎస్‌ కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా హఠాత్తుగా అదృశ్యమైంది. బాలిక అదృశ్యం కావడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి జాడ కోసం ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి.

అదే సమయంలో, వారు తప్పిపోయిన బాలిక ఆచూకీకి సంబంధించిన లీడ్స్‌ను గుర్తించే ప్రయత్నంలో CCTV ఫుటేజీని శ్రద్ధగా విశ్లేషించారు. విచారణలో కృష్ణవేణిని అదే కాలనీకి చెందిన సురేష్ అనే వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు. కృష్ణవేణిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిందితుడిని గుర్తించారు. పోలీసులు అతడి నుంచి బాలిక కృష్ణవేణిని సురక్షితంగా రక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

dengue cases : కేరళలో పెరుగుతున్న టైప్ 2 డెంగ్యూ కేసులు; 4 రోజుల్లో 5 గురు మృతి

Salaar Teaser : ‘సలార్’ టీజర్ విడుదల.. ప్రభాస్ మాస్ లుక్ అదుర్స్‌!

 

 

Exit mobile version