Homeviral newsViral Video: త‌ల్లి కొడుతుంద‌ని మూడేళ్ళ బాలుడు పోలీస్ స్టేషన్‌కు.. స్పందించిన హోంమంత్రి

Viral Video: త‌ల్లి కొడుతుంద‌ని మూడేళ్ళ బాలుడు పోలీస్ స్టేషన్‌కు.. స్పందించిన హోంమంత్రి

Telugu Flash News

Viral Video: సోష‌ల్ మీడియాలో నిత్యం కొన్ని వేల కొల‌ది వీడియోలు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. అందులో కొన్ని మాత్ర‌మే నెటిజ‌న్స్ ని అల‌రిస్తుంటాయి.తాజాగా ఓ చిన్నారి త‌న త‌ల్లిపై కంప్లైంట్ చేసే వీడియో ప్ర‌తి ఒక్క‌రిని ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది. మధ్యప్రదేశ్‌లో మూడేళ్ళ బాలుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన సమస్యను వివరించి న్యాయం చేయమని, త‌న త‌ల్లిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరాడు.

ఆ చిన్నారి ఫిర్యాదు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. బుర్హాన్‌పూర్ లోని ఖక్నార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డెడ్తలై గ్రామానికి చెందిన సద్దాం… ఇంట్లో అమ్మ తిట్టిందనే కోపంతో డైరెక్ట్‌గా పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లాడు.

వైర‌ల్ వీడియో..

అక్క‌డ లేడీ ఎస్‌ఐ ప్రియాంక నాయక్‌ని క‌లిసి ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పాడు. తనను తల్లి మందలించిందని ఆమెపై ఫిర్యాదు నమోదు చేయమని కోరాడు. మా అమ్మను శిక్షించండి అంటూ కోపంతో చిన్నారి మాట్లాడిన మాట‌లు ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే నెటిజ‌న్స్ ఈ వీడియోపై క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు.

హోంమంత్రి వీడియో కాల్‌

ఇక ఈ వీడియోపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి కూడా స్పందించ‌డం విశేషం. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా … పిల్లాడు చేసిన పనికి ఫిదా కాగా, దీపావళి కానుకగా.. బాలుడికి సైకిల్ ఇచ్చారు. అంతేకాదు, అతడితో వీడియో కాల్‌లో మాట్లాడి ఆనందింప‌జేశారు.

అయితే పోలీస్ స్టేష‌న్ కి వెళ్లి ఇచ్చిన కంప్లైంట్‌ని సబ్‌ ఇన్స్‌పెక్టర్ ప్రియాంక నాయక్ తీసుకోవ‌డం విశేషం. పోలీస్‌ వ్యవస్థపై, పోలీసులపై పిల్లాడికి నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో కంప్లైంట్ తీసుకుంటున్నట్లుగా పేప‌ర్‌పై తానే రాసి తీసుకుంది. పిల్లాడి మనసును అర్ధం చేసుకోకుండా మంద‌లించిన త‌ల్లిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్ప‌డం కొస‌మెరుపు.

-Advertisement-

ఆ బుడ్డోడికి వాళ్ల అమ్మ మీద కోపమెందుకొచ్చిందంటే..

కొద్ది రోజులుగా ఇంట్లో తెగ మారాం చేస్తున్నాడ‌ట‌. తలస్నానం చేయించాక కాటుక పెడుతుంటే పెట్టించుకోవ‌డం లేద‌ట‌. వాళ్ల నాన్న తన కోసం తెచ్చిన చాక్లెట్లన్నీ దొంగతనం చేస్తోందట.దీంతో చెంప మీద చిన్న దెబ్బ వేయ‌డంతో కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. త‌న నాన్న‌ని తీసుకొని పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News