కేరళలో (kerala) దారుణం జరిగింది. అలప్పుజ కన్నూర్ ఎక్స్‌ప్రెస్ (alappuzha kannur express) లోని డి1 కంపార్ట్‌మెంట్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. చివరకు గొడవ అనంతరం కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోశాడు.ఆ తర్వాత ప్రయాణికుడికి నిప్పంటించాడు. కొద్ది క్షణాల తర్వాత.. రైలు చైన్ లాగి అక్కడి నుంచి పారిపోయాడు.
రైలు కన్నూర్‌కు చేరుకోగా, ముగ్గురు ప్రయాణికులు గల్లంతైనట్లు తోటి ప్రయాణికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ట్రాక్‌లపై పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. ఇంతలో వారికి మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ మహిళ, మరో వ్యక్తి, ఏడాది వయసున్న చిన్నారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కోజికోడ్‌లోని ఎలత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో మంటలు చెలరేగడం చూసి రైలు నుంచి దూకే వారు ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన మహిళ ఎవరు? దహనం చేసిన వ్యక్తి ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు? ఈ విషయాలు తెలుసుకోవలసి ఉంది.రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అలప్పుజా-కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికుడికి నిప్పంటించిన ఘటనలో 8 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారు కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. మంటలు చెలరేగిన డీ1 కంపార్ట్‌మెంట్ వంతెనపైనే ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
also read:
blue tick for free : ఉచిత ట్విటర్ బ్లూ టిక్ ! ఎవరికి, ఎందుకో తెలుసా?
Nani: నానిపై ప్రేమను కురిపించిన శృతి హాసన్ లవర్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్