Telugu Flash News

2022 Tech Layoffs: రాబోయే కొన్ని వారాల్లో డేంజర్ బెల్స్ !!

layoffs 2022

2022 Tech Layoffs: ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ‘లే ఆఫ్స్‌’ (ఉద్యోగుల తొలగింపు) . బడా బడా టెక్, ఐటీ కంపెనీలు అదే పనిగా లే ఆఫ్స్‌ చేస్తున్నాయి. ఎంతోమందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుండి నుంచి తీసేస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం, ప్రతికూల ఆర్థిక పరిస్థితి వంటి కారణాల వల్ల కంపెనీలు ఇలా చేస్తున్నాయి.

ఫేస్ బుక్ (Meta) భారీ తొలగింపులను ప్లాన్ చేస్తుండగా, Lyft కంపెనీ 700 మందిని తీసేసేందుకు, ఫైనాన్షియల్ దిగ్గజం స్ట్రైప్ 14 శాతం సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించాయి.వ్యాపార మరియు పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ప్రారంభం మాత్రమే!!

రానున్న రోజుల్లో ఉద్యోగ కోతల పరంగా దారుణమైన రోజులు చూడాల్సి రావచ్చు. ఒక నివేదిక ప్రకారం.. రాబోయే కొద్ది వారాల్లో, ఉద్యోగ కోతలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది.

ఆదాయాలు డౌన్.. ఇక కాస్ట్ కటింగ్..

టెక్నాలజీ కంపెనీల ఆదాయం నిరంతరం తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు.  ఆర్థిక మాంద్యం ముప్పు కూడా ఉన్నందున టెక్ కంపెనీలు ఇప్పటికే వ్యక్తులను తొలగించడం ద్వారా పేరోల్ ఖర్చులను తగ్గించడానికి సిద్ధమయ్యాయి. దీని అర్థం రాబోయే వారాల్లో వేలాది మంది సాంకేతిక కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోవచ్చు.  మాంద్యం ముప్పు పొంచి ఉంది.

గత కొన్ని వారాలుగా తమ ఆదాయాలు తగ్గుముఖం పట్టాయని పెద్ద టెక్ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో పాటు భవిష్యత్‌ పరిస్థితిపై కూడా హెచ్చరించారు. మాంద్యం యొక్క ముప్పు వల్ల కంపెనీలు వాటి ఖర్చులను తగ్గించుకోవలసి వస్తోంది.

ప్రస్తుతం కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఇందులో భాగంగానే లే ఆఫ్స్‌ వైపు చూస్తున్నాయని కొలంబియా బిజినెస్ స్కూల్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాన్ వాంగ్ చెప్పారు.

కంపెనీలు కాస్ట్ కటింగ్ పై దృష్టి పెట్టినప్పుడల్లా .. వాటి ప్రధాన దృష్టి తరచుగా ఉద్యోగాలు, ప్రకటనలు, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించడంపైకి వెళ్తుందని ఆయన విశ్లేషించారు.మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతిష్టంభన నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న టెక్ కంపెనీలకు.. ఆర్ధిక మాంద్యం మరో సవాల్ విసురుతోందని చెప్పారు.

టెక్ కంపెనీల్లో తొలగింపులు..

also read news: 

Viral Pic : ఎంత గొప్ప మనసు.. మానవత్వం అంటే ఇదేనేమో..

 

 

Exit mobile version