Telugu Flash News

19-03-2024 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu ఈ రోజు రాశి ఫలాలు

today horoscope in telugu : మార్చి 19, 2024 ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Aries | మేష రాశి ఫలాలు 19-03-2024

మేష రాశి వారు చేసే ప్రతీ పని అనుకూలించును. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు అంతా అనుకూల ఫలితాలున్నాయి. స్త్రీలు కుటుంబ విషయాల్లో కొంత‌ జాగ్రత్తలు వహించాలి. దీపాన్ని వెలిగించడం వ‌ల‌న‌ శుభఫలితాలు క‌లుగుతాయి.

Taurus | వృషభ రాశి ఫలాలు 19-03-2024

వృషభ రాశి వారు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలించును స్త్రీలకు మానసిక వేదన, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉంటుంది.. వృషభరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.

Gemini | మిథున రాశి ఫలాలు 19-03-2024

ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మానసిక ఆందోళనలు వేదనలు అధికముగా ఉంటాయి. సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 19-03-2024

ఈ రాశి వారికి చెడు ఫలితాలు అధికముగా ఉంటాయి. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించవలసిన సమయము. వీరికి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును. నూతనముగా వస్తువులను కొనడానికి ప్రయత్నిస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆరోగ్య విషయాలయందు కొంత జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Leo | సింహ రాశి ఫలాలు 19-03-2024

సింహరాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో కొంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం ఉద్యోగ వ్యాపారాలయందు అనుకూల ఫలితములు అధికముగా ఉన్నాయి..

Virgo | కన్యా రాశి ఫలాలు 19-03-2024

ఈ రాశి వారికి సమాజంలో కీర్తి కలుగును. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసేదరు. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. చేసే ప్రతీ పనిలో విజయం సాధిస్తారు.. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలించును.

Libra | తులా రాశి ఫలాలు 19-03-2024

ఈ రాశి వారికి శత్రు వర్గము వలన ఇబ్బందులు, కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు.. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సౌఖ్యముగా ఉంటుంది.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 19-03-2024

ఈ రాశికి కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును . ధన లాభము కలుగును. ముఖ్యమైన పనులు విజయవంతముగా పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉ న్నప్పటికి అనుకున్న పనిని స‌కాలంలో పూర్తి చేసెదరు.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 19-03-2024

ఈ రాశి వారికి ఉద్యోగమునందు అనుకూలత కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త సమయముగా ఉంటుంది.. ధనుస్సు రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

Capricorn | మకర రాశి ఫలాలు 19-03-2024

మకర రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఈ రాశి వారు గొడవలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. . రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మకరరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం ఉత్త‌మం.

Aquarius | కుంభ రాశి ఫలాలు 19-03-2024

కుంభ రాశి వారికి ధనపరమైన సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, వేదనలు అధికముగా ఉండును. ఆర్ధిక సమస్యలు ఏర్పడుతాయి.. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు సమస్యలు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అప్పు పుట్టును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగుతారు..

Pisces | మీన రాశి ఫలాలు 19-03-2024

మీన రాశి వారికి ఈ రోజు అంత అనుకూలముగా లేదు. ధనపరమైనటువంటి వ్యవహారాలయందు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.. మీనరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించ‌డం మంచిది.

also read :

Devotional: శంఖం సంపదకు ప్రతిరూపం.. ఎలా పూజించాలంటే..

Devotional: సనాతన ధర్మం ప్రకారం నిత్య పూజ ఎలా చేసుకోవాలి?

 

 

 

Exit mobile version