18 Pages telugu movie review : వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తుండే నిఖిల్ చివరిగా కార్తికేయ 2తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా 18 పేజెస్ అనే డిఫరెంట్ లవ్ స్టోరీతో వచ్చాడడు, అయితే ఈ చిత్రం పై అంచనాలు పెరగడానికి కార్తికేయ 2 సక్సెస్ ఒక్కటే కారణం కాదు, ఇందులో ఆకర్షణీయమైన కథాంశం మరియు బృందం ఉండడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు . ఈ సినిమాకి సుకుమార్ కథను అందించడంతో చిత్రం పై అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి.
కథ:
ఫోన్, ఫేస్బుక్ లేదా వాట్సప్ వంటివి ఉపయోగించకుండా ప్రస్తుత ప్రపంచానికి దూరంగా జీవించే నందిని (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి జీవితం ఎలా మారింది అనే సినిమాలో చూపించారు. అయితే ఆమెకి జ్ఞపక శక్తి లోపం ఉందనే విషయాన్ని ఆయన ప్రియుడు అయిన సిద్ధార్త్ తెలుసుకుంటాడు. నందిని తన దినచర్యలను డైరీలో రాయడం చేస్తుండగా, డైరీలోని 18వ పేజీలో ఉండగా ఆమె కిడ్నాప్ అవ్వడం మరియు జ్ఞాపక శక్తిని కోల్పోవడం కథలో కీలక మలుపు. మరి నందినిని సిద్ధార్త్ ఎలా పట్టుకున్నాడు అనేది కథ.
పర్‌ఫార్మెన్స్:
ప్లస్ పాయింట్లు:
- కథ
- నటీనటులు
మైనస్ పాయింట్లు:
భావోద్వేగం లేకపోవడం
విశ్లేషణ:
18 పేజెస్ చిత్రంలో కథనం మరియు ఆసక్తికరమైన పాత్రలు మొదటి సగంలో బాగా రాసుకున్న ప్రేమ కథ, ఇంటర్వెల్ ట్విస్ట్‌లు చివరి సగం చూడాలనే ఆసక్తిని కలిగించేంతగా ఉన్నాయి. మొదటి సగం ప్రేమ కథతో ముడిపడి ఉండగా,రెండవ సగం నందిని కిడ్నాప్‌కు గురవ్వడంతో థ్రిల్లర్ మోడ్ లోకి మారుతుంది, ఆపై నుండి రేసీ స్క్రీన్‌ప్లే మరియు సిద్ధార్థ్ ఎలా ఆమె తన డైరీని ఉపయోగించి తనని కనిపెడతాడు అనేది మనల్ని కథలోకి లాగి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. సెకండాఫ్ ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది.
18 Pages movie రేటింగ్ 3/5
also read :
america weather today : భారీగా కురుస్తున్న మంచు.. విమానాలు రద్దు