Homebigg boss telugu season 6Bigg Boss 6: ర‌స‌వ‌త్త‌రంగా నామినేషన్స్.. ఈ సారి నామినేష‌న్స్‌లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయో తెలుసా ?

Bigg Boss 6: ర‌స‌వ‌త్త‌రంగా నామినేషన్స్.. ఈ సారి నామినేష‌న్స్‌లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయో తెలుసా ?

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 రోజులు గడుస్తున్న కొద్ది ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఇందులోని టాస్క్‌లు, కంటెస్టెంట్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జా అందిస్తుంది. గ‌త‌వారం బిగ్ బాస్ ఎలిమినేష‌న్‌లో కూడా కొంత ట్విస్ట్ ఇచ్చి షోపై ఆస‌క్తి క‌లిగేలా చేశారు.

ఇక సోమ‌వారం అంటే నామినేష‌న్ ర‌చ్చ ఎంత‌గా ఉంటుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజా నామినేష‌న్స్‌లో హీట్ మాములుగా లేదు. కంటెస్టెంట్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీప‌డ్డారు.

ఇనయా బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా ప్ర‌క‌టించుకోవ‌డం విశేషం. ఇక సూర్య ఎలిమినేషన్ తో హౌస్లో 13 మంది మిగిలి ఉంగా, వీరిలో ఒకరు ఈ వారం హౌస్ వీడనున్నారు. ఇద్ద‌రు ఎలిమినేట్ అయిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

ర‌స‌వ‌త్త‌రంగా నామినేషన్స్

ఇక సోమ‌వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న దిష్టి బొమ్మలపై కంటెస్టెంట్స్ ఫోటోలు అతికించి ఉంచారు. ప్రతి కంటెస్టెంట్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేయనున్న కంటెస్టెంట్ ఫోటో ఉన్న బొమ్మకు కుండ తలగా తగిలించి ఉండ‌గా, దాన్ని బద్దలు కొట్టాలి.

geetu in bigg boss 6ముందుగా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయాలని బిగ్ బాస్ గీతూని ఆదేశించగా, గీతూ వరుసగా భార్యాభర్తలు రోహిత్, మెరీనాలను నామినేట్ చేయ‌డం విశేషం. బిగ్ బాస్ గేమ్ కలిసి ఆడారని మెరీనాను, రోహిత్ కి అసలు గేమ్ పై వారికి ఎలాంటి క్లారిటీ లేదన్న కారణంతో నామినేట్ చేసింది.

నెక్స్ట్ రేవంత్… కీర్తి, ఇనయాలను నామినేట్ చేయ‌గా, ఆదిరెడ్డి… ఇనయా, రేవంత్ లను చేయడం జరిగింది. రేవంత్ ని ఆదిరెడ్డి నామినేట్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇక మిగ‌తా కంటెస్టెంట్స్ నామినేష‌న్ వివ‌రాలు పరిశీలిస్తే…

-Advertisement-

మెరీనా… శ్రీసత్య, గీతూ; ఆదిత్య… శ్రీసత్య, ఫైమా; కీర్తి… గీతూ, రేవంత్ ; రోహిత్… గీతూ, శ్రీసత్య; వాసంతి… గీతూ, రేవంత్ ; రాజ్. .. గీతూ , బాల ఆదిత్య; ఫైమా… బాల ఆదిత్య, ఇనయా; శ్రీసత్య…బాల ఆదిత్య, ఇనయా; ఇనయ… గీతు, ఆదిరెడ్డి ; శ్రీహన్… కీర్తి, ఇనయా లను వరుసగా నామినేట్ చేయడం జరిగింది.

ఈ సారి నామినేష‌న్‌లో గీతూతో పాటు ఇన‌య‌కు ఎక్కువ పాయింట్స్ ప‌డ్డాయి. ఇనయా, ఫైమా మధ్య భారీ వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తానికి ఇక ఈ వారం రేవంత్, ఆదిరెడ్డి, గీతూ, బాల ఆదిత్య, కీర్తి, శ్రీసత్య, ఇనయా, రోహిత్, మెరీనా, ఫైమా నామినేష‌న్స్ లో ఉండ‌గా, వీరిలో ఒక‌రు హౌజ్‌ని వీడ‌నున్నారు.

read more news :

Happy Birthday Aishwarya Rai : ఈ ప్రపంచ సుందరి గురించి తెలుసుకోవాల్సిన 40 వాస్తవాలు

horoscope : 1-11-2022 ఈ రోజు మీ రాశి ఫలితాలను చూడండి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News