Telugu Flash News

స్టోర్‌ కీపర్‌ జీతం 45 వేలు! ఆస్తి 10 కోట్లు.. అధికారులు షాక్!

Madhya Pradesh officer who earned Rs 45,000

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫీసర్ ల అక్రమాస్తుల జాబితా ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ఈ మద్య మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ ఇన్‌చార్జి అసిస్టెంట్ ఇంజినీర్ అక్రమాస్తులను చూసి అధికారులు అవాక్కయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆస్తిని చూసి బిత్తరపోయారు. వైద్యారోగ్య శాఖలో చిరుద్యోగిగా పనిచేసిన ఓ వ్యక్తి ఆస్తులు ఏకంగా రూ.కోట్లల్లో ఉన్నాయి.

అష్పక్ అలీ మధ్యప్రదేశ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో స్టోర్ కీపర్‌గా పని చేస్తూ నెలకు రూ.45,000 సంపాదిస్తున్నాడు. ఇప్పుడు రిటైరయ్యాడు. అయితే అలీకి ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు సమాచారం అందుకున్న లోకాయుక్త అధికారులు ఆయన ఇంట్లో తాజాగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.10 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు తెలుసుకున్నారు. రూ.46 లక్షల విలువైన బంగారం, వెండి, రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాదు అలీ ఇంట్లో ఉన్న వస్తువులను చూసి అధికారులు షాక్ అయ్యారు. మాడ్యులర్ కిచెన్, లక్షల రూపాయల విలువైన షాండ్లియర్, ఖరీదైన సోఫాలు, సోఫాలు, రిఫ్రిజిరేటర్, టీవీ ఉన్నాయి. ఓ స్టోర్ కీపర్‌ తన ఇంట్లో ఇంత ఖరీదైన వస్తువులు చూసి షాకయ్యారు. ఆయన ఆస్తుల మొత్తం విలువ రూ. 10 కోట్లు ఉంటుందని అంచనా. అలీ భార్య, కుమారుడు, కుమార్తె పేరిట రూ. 1.25 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన 16 స్థిరాస్తి పత్రాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

వీటితో పాటు నిర్మాణంలో ఉన్న నాలుగు భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌కు సంబంధించి వివరాలు రాబట్టారు. ఇంకా, మూడు అంతస్థుల భవనం పని చేస్తున్న పాఠశాలను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. దీంతో అలీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Exit mobile version