HomedevotionalHoroscope Today : 02-10-2022 రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారి వైవాహిక జీవితంలో అడ్డంకులు తొల‌గిపోతాయి..

Horoscope Today : 02-10-2022 రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారి వైవాహిక జీవితంలో అడ్డంకులు తొల‌గిపోతాయి..

Telugu Flash News

know your Horoscope today and astrological prediction for 2nd october 2022 :

02-10-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

మేష రాశి: ఈ రాశి వారి ఆర్ధిక ప‌రిస్థితి బాగుంటుంది.ఉద్యోగులు మంచి సమాచారాన్ని వింటారు. ఈ రోజు మీరు కుటుంబంలో కొన్ని సమస్యల గురించి ఆందోళన చెందే అవ‌కాశం ఉంది.

వృషభ రాశి: దానధర్మాలతో ఈ రోజంతా గడుపుతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామికి సంబంధించి శుభవార్త వింటారు. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు ఎదురైతే.. ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన అవ‌స‌రం ఎంతైన ఉంది. వైవాహిక జీవితంలో ఏర్ప‌డ్డ‌ అడ్డంకులు తొలగిపోతాయి.

మిథున రాశి: ఈరోజు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు అవ‌కాశాల‌ను పొందుతారు. డబ్బుకు సంబంధించిన ఏదైనా వివాదంలో పిల్లలపై కోప్ప‌డ‌తారు. పాత స్నేహితుడు క‌ల‌వ‌డంతో ఆనందంగా ఉంటారు.

కర్కాటక రాశి: ఈరోజు మీకు చాలాసంతోషకరమైన రోజు. ఈరోజు, మీ అత్తమామల వైపు నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. అదృష్టం 85 శాతం ఉంటుంది.

సింహరాశి: సింహ రాశి వారు ఏ పరిస్థితిలోనైనా ఓపికగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులు కొందరు ఈరోజు విందుకు మీ ఇంటికి రావచ్చు. మీరు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.

-Advertisement-

కన్యా రాశి: ఈరోజు ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు. కార్యాలయంలో కొన్ని శుభవార్తలు వినే అవ‌కాశం ఉంది. గ‌తంలో చేసిన త‌ప్పు మీకు గుణ‌పాఠంగా మారుతుంది.

తులా రాశి: ఈరోజు ఏదో ఒక పనిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని ప‌నుల‌ని స‌కాలంలో పూర్తి చేయకపోవడం వల్ల మీ మనస్సు కలత చెందుతుంది. విదేశాల్లో నివసిస్తున్న మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు కొంత నిరాశాజనకమైన సమాచారాన్ని వింటారు.

వృశ్చిక రాశి: ఈ రోజు ఆరోగ్యం పరంగా కొంత ఆందోళ‌న చెందుతారు.. మీ దినచర్యలో యోగా, వ్యాయామాన్ని అనుసరించడం ద్వారా కొన్ని వ్యాధుల నుండి బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంది.

ధనుస్సు రాశి: ఈ రోజు మీరు చాలా స‌ర‌దాగా గ‌డుపుతారు. పిల్లల కెరీర్‌లో ఏదైనా సమస్య ఉంటే, దానికి పరిష్కారం క‌నుగొంటారు. మీరు జీవిత భాగస్వామి కోసం కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.

మకర రాశి: ఈ రోజు ఇంటి నుంచి పని చేసే వ్యక్తులు తమ పనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేరు. ఈ రాశి వారు కొంత ఇబ్బందుల్లో పడవచ్చు. భవిష్యత్ ప్లాన్‌లలో డబ్బు ఆదా చేయడం గురించి ఎంత‌గానో ఆలోచిస్తారు.

కుంభ రాశి: ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పటికీ, మీరు దాని నుంచి సులువుగా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశ ఉంది. ప్ర‌తి విషయంలోను చాలా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌సరం ఎంతైన ఉంది.

మీనరాశి: మీ మనస్సులో ఏదో ఒక విషయంలో సందేహాలు ఉంటాయి. దాని కారణంగా కొంత ఆందోళ‌న చెందే అవ‌కాశం ఉంది.. విద్యార్థులు పరీక్షల ప్రిపరేషన్‌లో కొంత విశ్రాంతి తీసుకోవ‌ల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్యం బారిన ప‌డే అవ‌కాశం ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News